Soil Test : భూసార పరీక్షలు.. పంటలకు బలం.. తక్కువ పెట్టుబడితో.. అధిక దిగుబడులు

Soil Test : సాగు విషయంలో రైతులు విక్షణా రహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అణుగుణంగా ముందుకు సాగాలి.

Soil Test For Agriculture : సాగు విధానంలో కొందరు రైతులకు అంతగా అవగాహన ఉండదు. ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు తీసుకోరు. తోటి రైతు వాడుతున్న ఎరువులేమిటో తెలుసుకుని దానినే అనుసరిస్తారు. ఇది సరైన పద్ధతికాదు. ఒక్కో భూమికి ఒక్కో లక్షణం ఉంటుంది. అన్నింటికీ ఒకే రకమైన ఎరువులు పనికిరావు. భూసార పరీక్షలు చేయిస్తే అవసరమైన ఎరువులు ఏమిటో తెలుసుకోవచ్చు. దీంతో సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. రాయల శ్రీనివాస రావు.

Read Also : Betel Leaves Cultivation : కొబ్బరిలో అంతర పంటగా తమలపాకు సాగు.. లాభాలు బాగు

సాగు విషయంలో రైతులు విక్షణా రహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అణుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించొచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్‌లో పంటలకు పనికిరాకుండా పోతుంది.

భూమిలో ఏయే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం.  భూసార పరీక్షలు ఆధారంగా సాగు చేయాలి. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం . అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. రాయల శ్రీనివాస రావు.

వేసవిలో పంటల పొలాలు దాదాపు ఖాళీగా ఉంటాయి. ఈ నెలలో భూసార పరీక్షలు చేయించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కావున శాస్త్రవేత్తల సూచనలు మేరకు మట్టి నమూనాలను సేకరించి.. భూసార పరీక్షలు చేయించుకుంటే.. ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు..అధిక దిగుబడులు పొందవచ్చు.

Read Also : Banana Cultivation : అరటిసాగులో రకాలు, పిలకల ఎంపిక.. మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం 

ట్రెండింగ్ వార్తలు