Banana Cultivation : అరటిసాగులో రకాలు, పిలకల ఎంపిక.. మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం 

Techniques in Banana Cultivation : అరటి తోటల సాగుకు  ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రెల్ ఆగష్టు మాసాల మధ్య నాటటం వల్ల సాగులో సమస్యలు తక్కువగా వుండి, దిగుబడలు ఆశాజనకంగా వుంటున్నాయి.

Banana Cultivation : అరటిసాగులో రకాలు, పిలకల ఎంపిక.. మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం 

Techniques in Banana Cultivation

Techniques in Banana Cultivation : తెలుగు రాష్ట్రాల్లో అరటి సాగు క్రమేపి విస్తరిస్తోంది. గత పది సంవత్సరాలలో  సాగు విస్తీర్ణం రెండున్నర రెట్లు పెరిగింది. దాదాపు లక్షా 65వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. అరటి  దిగుబడిలో భారతదేశం 2వ స్థానంలో వుండగా.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీనిసాగు ఎక్కువగా వుంది. అయితే రకాల ఎంపిక, పిలకల ఎంపిక మొదలు నాటే వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త,  డా. సుధా జాకబ్.

Read Also : Agricultural Machinery : రైతుకు శ్రమ, ఖర్చు తగ్గించి.. వ్యవసాయంలో ఉపయోగపడే యంత్రపరికరాలు

అరటి తోటల సాగుకు  ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రెల్ ఆగష్టు మాసాల మధ్య నాటటం వల్ల సాగులో సమస్యలు తక్కువగా వుండి, దిగుబడలు ఆశాజనకంగా వుంటున్నాయి. సాధారణంగా  తల్లిమొక్కల నుండి పిలకలను సేకరించి, నాటే విధానం ఎప్పటినుంచో ఆచరణలో వుంది. కానీ టిష్యూకల్చర్ విధానం అందుబాటులోకి వచ్చాక సాగు స్వరూపం మారిపోయింది. ఏ విధానంలో సాగు చేసినా , రకాల ఎంపిక, నాటే విధానం పట్ల  రైతులు ప్రధానంగా దృష్టిపెడితే సాగులో సగం విజయం సాధించినట్లేనని సూచిస్తున్నారు  సీనియర్ శాస్ర్తవేత్త డా. పి.సుధా జాకబ్ .

సాధారణంగా మన రైతులు తల్లిమొక్కల నుంచి సూదిపిలకలను సేకరించి నాటుతూవుంటారు. దీనివల్ల తల్లితోటల్లో వుండే చీడపీడలు, క్రొత్తగా నాటిన తోటలకూ ఆశించి, దిగుబడులు తగ్గే ప్రమాదం వుంది. ఇలాంటి సమస్యలను అధిగమించి, పంటంతా ఒకేసారి కోతకు వచ్చేలా  టిష్యూకల్చర్ మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొక్కలు నాటటం వల్ల రైతులకు ఖర్చు తగ్గి , దిగుబడి పెరుగుతోంది.

నాటే విధానంలో వచ్చిన మార్పులు వల్ల పొలంలో మొక్కల సంఖ్య పెరిగి దిగుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా   జంట సాళ్ల పద్ధతిలో అధిక సాంద్రతలో మొక్కలను నాటి అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. అరటి నాటిన తరువాత అంతర కృషి చాలా ముఖ్యమైనది. లేదంటే మొక్కల ఎదుగుదలను అడ్డుకునే అవకాశం ఉంది. కలుపు నివారణకు రసాయన మందులు సమర్థంగా పనిచేస్తున్నాయని  సూచిస్తున్నారు శాస్త్రవేత్త.

Read Also : Agricultural Tips : 50 శాతం సబ్సిడీతో.. సీడ్ డ్రిల్, గడ్డికట్టే యంత్రం