Sugarcane Cultivation : చెరకు సాగులో పాటించాల్సిన మెళకువలు.. అధిక దిగుబడులకు పాటించాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు.

Sugarcane Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే దీర్ఘకాలిక వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది.  10 నుంచి 12 నెలల్లో చేతికొచ్చే ఈ పంటలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. ముఖ్యంగా ఈ పంట విస్తీర్ణం అధికంగా వున్నా ఆశించినంత దిగుబడులను పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. డి. చిన్నమ నాయుడు.

చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. దీంతోపాటు అధిక దిగుబడినిచ్చే రకాలపై జరుగుతున్న విస్త్రృత పరిశోధనలతో, అనేక నూతన రకాల రూపొందటంతో, సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు చెరకు నాటతారు.

రాయలసీమ ప్రాంతాల్లో జనవరి  నుండి ఫిబ్రవరి లో నాటుతీరు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆలస్యంగా నాటుకునే వారు మార్చి నుండి మే వరకు చెరకును నాటుకోవచ్చు.  ఆయాప్రాంతాల వాతావరణం, భూమి స్థితిగతులకు అనుగుణంగా, అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతోపాటు, చీడపీడలు తట్టుకునే గుణాలను బేరీజు వేసుకుని, సాగులో ముందడుగు వేస్తే, చెరకు సాగులో మున్ముందు సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు  ప్రధాన శాస్త్రవేత్త డా. డి. చిన్నమ నాయుడు.

చెరకును ఆశించే శిలీంద్రతెగుళ్లను అరికట్టేందుకు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. చెరకును నాటిన తరువాత  వచ్చే కలుపును అరికట్టే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పంట దిగుబడుల విషయంలో ఎరువుల పాత్ర చాలా ముఖ్యమైంది. సిఫార్సు మేరకు సిఫార్సు సమయంలో ఎరువులను వాడితే అధిక దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Read Also : Sugarcane Cultivation : చెరకు కార్శితోటల యాజమాన్యం.. సాగుతో సమయం, పెట్టుబడి ఆదా

ట్రెండింగ్ వార్తలు