Sugarcane Cultivation : పక్వదశలో చెరకు తోటలు.. జడచుట్లతో కాపాడుకోవాలంటున్న శాస్త్రవేత్తలు
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి.
- Guntupalli Ramakrishna
- Published On : August 16, 2023 / 09:37 AM IST
Sugarcane Cultivation
: తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న వాణిజ్యపంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరుకు ఆరు నుండి ఎనిమిది నెలల వయస్సులో వుంది. ఈ దశలో భారీవర్షాలు, ఈదురుగాలులు వస్తే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కోస్తాప్రాంతాల్లో జడచుట్లు ద్వారా చెరకు తోటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజ్ కుమార్.
READ ALSO : Sugarcane Cultivation : చెరకు తోటల్లో పెరిగిన తెగుళ్ల ఉదృతి.. సమగ్ర సస్యరక్షణ
తెలుగు రాష్ట్రాలలో అధిక విస్థీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. 12నెలలపాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగాను, అధిక శాతం నీటి పారుదల కింద సాగుచేస్తున్నారు. ప్రస్తుతం 6 నుండి 8 నెలల దశలో చెరకు తోటలు ఉన్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
READ ALSO : Sugarcane Cultivation : చెరకు సాగులో మెళకువలు
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి. దుబ్బులు ఎండిపోయి, కార్శి పంటలో దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల బాగా ఎదిగిన చెరకు తోటలు పడిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. రాజ్ కుమార్.
READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు
జడచుట్టు వేసేటప్పుడు భూమిలో తగినంత పదును ఉండాలి. లేదంటే గడలు విరిగిపోయే ప్రమాదం ఉంది. మొవ్వులోని 8 పచ్చని ఆకులను వదిలి, మిగిలిన ఆకులను విరిచి జడచుట్టు వేయాలి. పంట పెరిగేకొద్దీ రెండు నుండి 3 వరుసల్లో జడచుట్లు వేయవచ్చు. దీనివల్ల దిగుబడితో పాటు పంచదార దిగుబడి కూడా పెరుగుతుంది.
