Agricultural Tips : 50 శాతం సబ్సిడీతో.. సీడ్ డ్రిల్, గడ్డికట్టే యంత్రం

ట్రాక్టర్ ఆపరేటెడ్ న్యూమాటిక్ ప్లాంటర్  పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సన్ ఫ్లవర్ ,సోయాబీన్ పంటలను విత్తుకొవచ్చు. విత్తనాన్ని ఖచ్చితంగా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రధాన ఫ్రేమ్, ఆస్పిరేటర్ బ్లోవర్, రంధ్రాలతో కూడిన డిస్క్, మీటరింగ్ ప్లేట్, వ్యక్తిగత హాప్పర్, ఫర్రో ఓపెనర్లు , గ్రౌండ్ వీల్‌ను కలిగి ఉంటుంది.

Agricultural Tips : దేశానికి వెన్నుముఖ రైతు. రైతు కష్టపడితేనే ప్రజల నోట్లోకి అన్నం ముద్ద పోయేది. కానీ.. నేడు అన్నదాత అడుగడుగునా కష్టాలలో మునిగిపోతున్నాడు. ఒకప్పడు వ్యవసాయ పనులకు వెన్నుదన్నుగా వుండే కాడేడ్లు, ఎడ్లబండ్లు, నాగలి నేడు క్రమేపి కనుమరుగయ్యాయి. వ్యవసాయంలో పెరుగుతున్న యాంత్రీకరణ వల్ల, ఓ వైపు పశుపోషణ భారం కావడం, మరో వైపు అధిక డబ్బు వెచ్చించి సాగులో యంత్రాల వాడడంతో అన్నదాతలపై ఆర్థిక భారం పడుతుంది. యంత్రాలతో పని భారం తగ్గుతున్నా, పంటకు గిట్టాబాటు ధర లేకపోవటం రైతును కుంగదీస్తోంది. ఈ నేపద్యంలో రాష్ట్రప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కొన్ని యంత్రాల పనితీరు.. సబ్సిడీ వివరాలు ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Kandi Cultivation : కందిలో పెరిగిన చీడపీడల బెడద.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని సంప్రదాయ పద్ధతులు, సాంకేతికతలు మిగిలి ఉన్నప్పటికీ.. వ్యవసాయంలో మరింత సమర్థవంతమైన,  వినూత్న సాంకేతిక పురోగతులు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఇది పంటలు పండించే విధానాన్ని మార్చింది. వనరుల నిర్వహణ యొక్క సమర్థవంతమైన పద్ధతులకు దారితీసింది. నేడు వ్యవసాయంపై సాంకేతికత ప్రభావం కాదనలేనిది. ఇందుకు కారణం కూలీల సమస్య, పెరిగిన పెట్టుబడులు. అందుకే చాలా మంది రైతులు యాంత్రికరణవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపధ్యంలోనే పైలట్ ప్రాజెక్ట్ గా రెండు నియోజకవర్గాలలో రైతులకు రాయితీపై అధునాతన పనిముట్లు, యంత్రాలను అందించేందుకు శ్రీకారం చుట్టింది.

READ ALSO : Uddhav Thackeray : రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత మరో గోద్రా లాంటి ఘటన జరగొచ్చు…ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ట్రాక్టర్ ఆపరేటెడ్ న్యూమాటిక్ ప్లాంటర్  పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సన్ ఫ్లవర్ ,సోయాబీన్ పంటలను విత్తుకొవచ్చు. విత్తనాన్ని ఖచ్చితంగా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రధాన ఫ్రేమ్, ఆస్పిరేటర్ బ్లోవర్, రంధ్రాలతో కూడిన డిస్క్, మీటరింగ్ ప్లేట్, వ్యక్తిగత హాప్పర్, ఫర్రో ఓపెనర్లు , గ్రౌండ్ వీల్‌ను కలిగి ఉంటుంది. విత్తనాలను, ఎరువులను ఓకే సారి కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్ జత చేసిన ఈ మిషన్ ద్వారా అనుకున్న విత్తనాన్ని అనుకున్న విధంగా ఎలాంటి వేస్టేజీ లేకుండా చాలా సులభంగా నాట వచ్చును. ఒక గంట వ్యవధిలో ఒక ఎకరం విత్తనాన్ని దీని ద్వారా నాటవచ్చు. దీని ధర రూ. 6 లక్షల యాభైవేలుగా కంపెనీ నిర్ధేశించింది. కానీ రైతులకు 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. దీనితో పాటు భూమ్ స్ప్రేయర్ కూడా రైతలను విశేసంగా ఆకట్టుకుంటోంది.

READ ALSO : Chandrababu Naidu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు.. ఇంటి నుంచి బ్రేక్‌ఫాస్ట్‌‌.. ఏం పంపించారంటే..

వరి పంటసాగులో అయ్యే ఖర్చు తగ్గించి, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచి అధిక లాభాలు పొందాలంటే రైతులు ఆధునిక వ్యవసాయ పరికరాలను వాడాల్సిందే. అందుకే దుక్కిదున్నే దగ్గరనుండి పంట నూర్చి ఇంటికి చేర్చె వరకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వరికోత మిషన్ వచ్చిన తర్వాత పశుగ్రాసం అక్కరకు రాకుండా దానిని పొలంలోనే కాల్చి బూడిద చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో చాలా మంది పాడిపశువులను అమ్ముకున్నారు. అయితే ఇటీవల కాలంలో వరికోత యంత్రం ద్వారా ముక్కలైన గడ్డిని కట్టలుగా కట్టే యంత్రం రైతులకు అందుబాటులోకి వచ్చింది.  ఈ బేలర్ తో తడి గడ్డి, పొడి గడ్డిని ఏక కాలంలో రౌండ్ గా బేలర్ గా చుట్టవచ్చు. ఇది అన్ని రకముల ట్రాక్టర్లకు, తక్కువ హెచ్ పీ మోడళ్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. బుల్ ఆగ్రో బేలర్ అత్యంత అధునాతన ఫీచర్లతో పని చేస్తుంది. ఇది గడ్డిని రౌండ్ గా చుట్టడంలో చాలాసులభంగా పని చేస్తుంది. ఒక గంట వ్యవధిలో ఇది 60 నుంచి 80 కట్టలు కడుతుంది.

ట్రెండింగ్ వార్తలు