Uddhav Thackeray : రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత మరో గోద్రా లాంటి ఘటన జరగొచ్చు…ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత గోద్రా లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఉద్ధవ్ చెప్పారు....

Uddhav Thackeray : రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత మరో గోద్రా లాంటి ఘటన జరగొచ్చు…ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

Uddhav Thackeray

Uddhav Thackeray : శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత గోద్రా లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఉద్ధవ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అయోధ్యలో ప్రారంభోత్సవం కోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారని, తిరుగు ప్రయాణ సమయంలో గోద్రా లాంటి సంఘటన జరగవచ్చని ఆయన ఆదివారం పేర్కొన్నారు. (Uddhav Thackeray)

Spain soccer chief : ముద్దు ఘటన తర్వాత స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్ రాజీనామా

2002వ సంవత్సరం ఫిబ్రవరి 27వతేదీన గుజరాత్‌ రాష్ట్రంలోని గోద్రా స్టేషన్‌లో అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కరసేవకుల రైలు కోచ్‌పై దాడి చేసి పలువురి మరణాలకు దారితీసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లను ప్రేరేపించింది. (Godhra like situation likely after Ram Temples inaugural event) ‘‘బస్సులు, ట్రక్కులలో రామాలయ ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉంది, వారి తిరుగు ప్రయాణంలో గోద్రా లాంటి సంఘటన జరగవచ్చు’’ అని థాకరే జల్గావ్‌లో అన్నారు.

US Open 2023: నోవాక్ జొకోవిచ్‌కు 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్

లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు అంటే 2024వ సంవత్సరం జనవరి 21వతేదీన రామమందిరాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఎన్‌సీపీతో చేతులు కలపడం ద్వారా ముఖ్యమంత్రి కావడానికి బాల్ థాకరే ఆదర్శాలను విడిచిపెట్టినందుకు బీజేపీ తరచుగా థాకరేని లక్ష్యంగా చేసుకుంది. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తాము బాల్ థాకరే హిందుత్వానికి నిజమైన అనుచరులమని చెప్పుకుంటోంది.