×
Ad

Mother And Two Children Suicide : కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

  • Published On : September 1, 2022 / 06:41 PM IST

Mother And Two Children Suicide

Mother And Two Children Suicide : నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జై భీమ్‌ నగర్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి గీత, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వింజమూరులోని జై భీమ్​నగర్​లో సాదం గీత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు వెంకట్ (10), చరిష్మా (5)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గీత భర్త వెంకట్రావు సమీపంలోని గ్యాస్​ గోడౌన్​లో గుమస్తాగా పని చేస్తున్నాడు.

Married Woman Suicide : భర్త వేధింపులు భరించలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య

మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి రాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉరేసుకుని ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.