A young man behaved indecently : ప్రకాశం జిల్లా పొదిలిలో మున్సిపల్ కార్మికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ యువకుడికి దేహశుద్ధి జరిగింది. విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న కార్మికురాలు..పరిచయం ఉన్న వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. బైక్పై ఎక్కించుకున్న ఆ యువకుడు.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో ఆగ్రహానికి గురైన మున్సిపల్ కార్మికురాలు…తోటి మహిళలతో కలిసి ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.