AP Liquor Scam: లిక్కర్ కేసులో అవినాష్ రెడ్డికి ACB కోర్టు రిమాండ్.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించిన SIT
ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam) లో అవినాష్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.
- V Santhosh Kumar
- Published On : February 26, 2026 / 08:44 PM IST
ACB court remands Avinash Reddy in AP liquor scam
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డికు ACB కోర్టు రిమాండ్ విధించింది. ఈమేరకు రేపటివరకు రేమండ్ లో ఉండనున్నాడు అవినాష్ రెడ్డి. అనంతరం అవినాష్ రెడ్డిని గుంటూరు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఈ కేసులో ఉన్న ఇతర నిందితుల రిమాండ్ గడువు కూడా పూర్తవనున్న నేపథ్యంలో అందరినీ మళ్లీ రేపు కోర్టులో హాజరు పరచనున్నారు అధికారులు.
ఇక లిక్కర్ స్కాం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు అవినాష్ రెడ్డిని విజయవాడ కార్యాలయంలో విచారించారు. సుమారు అయిదు గంటల పాటు ఏ విచారణ జరిగింది. విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడినుంచి కోర్టులో హాజరు పరిచారు. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అవినాష్ రెడ్డి. కానీ, రెండు చోట్లా పిటిషన్లు కొట్టివేయబడటంతో సిట్ ఎదుట లొంగిపోయాడు అవినాష్ రెడ్డి.
DGCA: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకమీద అదనపు చార్జీలు ఉండవు.. ఆ సేవలు కూడా ఉచితం
ఇక రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది SIT. లిక్కర్(AP Liquor Scam) కుంభకోణంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని, A1 కేసిరెడ్డితో కలిసి కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిపాడని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏకంగా మద్యం సిండికేట్‌ను ఏర్పాటు చేసి కమీషన్లు, కిక్‌బ్యాక్‌ల ద్వారా భారీగా లాభాలు పొందినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
పాత బ్రాండ్లను తొలగించి, తమకు కమిషన్లు ఇచ్చే బ్రాండ్లను కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కూడా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
