ACB officials raid on durga temple vijayawada : ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యహ్నం సుమారు 40 మంది అధికారుల దేవస్ధానంలోని వివిధ విభాగాల్లో విడివిడిగా సోదాలు చేస్తున్నారు.
స్టోర్, చీరలు, పరిపాలనా విభాగం, ప్రసాదాల తయారీ, అమ్మకం విభాగాల్లో సోదా చేస్తున్నారు. లడ్డూ ప్రసాదాల అమ్మకాల కౌంటర్లోనూ, 300 రూపాయల దర్శనం టికెట్ల కౌంటర్ లోనూ లెక్కకు మించి నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.