AE Nukaraju Family Case : అమ్మను తీవ్రంగా కొట్టేవాడు.. సాధిక్ అరాచకాల గురించి సౌజన్య కుమారుడు రియాన్ష్ చెప్పిన సంచలన విషయాలు ఇవే..
AE Nukaraju Family Sadik Khan Case : సాధిక్ ఖాన్ పరిచయం, తన కుటుంబాన్ని అతడు పెట్టిన ఇబ్బందుల.. సౌజన్య పట్ల అతను వ్యవహరించిన తీరును సౌజన్య కుమారుడు రియాన్ష్ మీడియా ముందు వెల్లడించాడు.
- Harish Thanniru
- Updated on- August 26, 2026 / 08:35 AM IST
AE Nukaraju Family Case
AE Nukaraju Family Sadik Khan Case : కాకినాడ జిల్లా పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాధిక్ ఖాన్ ఏఈ కుటుంబంను వేధించిన తీరును మృతురాలు సౌజన్య కుమారుడు రియాన్ష్ వివరించారు. ఈ క్రమంలో బాలుడు కన్నీరు పెట్టుకున్నాడు.
Also Read : AP Govt : ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం
తండ్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో కలిసి రియాన్ష్ కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను కలిశారు. అమ్మమ్మ తాతయ్యల నుంచి సంక్రమించాల్సిన ఆస్తుల వివాదాలు పరిష్కరించి బాలుడికి అందజేయాలని వారు కోరారు. అనంతరం రియాన్ష్ మీడియాతో మాట్లాడుతూ.. సాధిక్ ఖాన్ పరిచయం, తన కుటుంబాన్ని అతడు పెట్టిన ఇబ్బందుల.. సౌజన్య పట్ల అతను వ్యవహరించిన తీరును వివరించాడు.
ప్రస్తుతం తాను ఐదో తరగతి చదువుతున్నానని చెప్పిన రియాన్స్ .. తాను మూడో తరగతిలో ఉన్న సమయంలో సాధిక్ ఖాన్ తో పరిచయం ఏర్పడిందని తెలిపాడు. తాను చదువుకునే స్కూల్లో అతడు కోచ్ గా ఉండేవాడు. తరువాత కొద్దికాలంకు అతన్ని స్కూల్ నుంచి తొలగించారు. దీంతో తన అకాడమీలో తనను చేర్పించాలని అమ్మను పలుసార్లు కోరాడు. ఆ తరువాత అతని ఫోన్ నెంబర్ ఇచ్చి.. తరచూ ఫోన్ చేసేవాడు. అప్పటి నుంచి అమ్మకు సాధిక్ ఖాన్ తో పరిచయం ఉండేది.
అమ్మను అతను అనేకసార్లు కొట్టాడు. ఎవరికైనా చెబితే టెర్రరిస్టులకు అప్పగిస్తా అంటూ నన్ను బెదిరించేవాడు. ప్రొటీన్ షేక్‌లో కెమికల్ కలిపి తాగించి నాన్నను చంపేశాడు. తన కుటుంబం పట్ల దుర్మార్గంగా ప్రవర్తించి తనను అనాథను చేశాడు అంటూ రియాన్ష్ ఏడ్చాడు. అతన్ని వదలొద్దు.. పెద్ద శిక్ష పడాలిని కోరాడు. ప్రస్తుతం నిందితుడు సాధిక్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే, పోలీసుల విచారణలో సాధిక్ ఖాన్ గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధిక్ వేరొక యువతిని రహస్యంగా వివాహం చేసుకొనేందుకు ప్లాన్ వేశాడని, ఈ విషయం తెలుసుకున్న సౌజన్య.. సాధిక్‌ను నిలదీసింది. దీంతో సౌజన్యను తీవ్ర స్థాయిలో బెదిరించాడు. తన పెళ్లికి అడ్డుతగిలితే నీ కుటుంబాన్ని అంతా చంపేస్తా అని సాధిక్ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సౌజన్యను సాదిక్ తీవ్రంగా కొట్టినట్లు.. నా జీవితానికి అడ్డొస్తే.. నీ ప్రైయివేట్ వీడియోలు బయటపెడతా అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ప్రతి విషయంలోనూ సౌజన్యను కొట్టడం.. నీ భర్త ఎలా చనిపోయాడో మీ కుటుంబానికి అదేగతి పట్టిస్తా అంటూ బెదిరించడం.. సౌజన్య ప్రయివేట్ వీడియోలు అడ్డుపెట్టుకొని.. కొడుకును చంపేస్తానంటూ.. ఆస్తి కాజేయాలని సాధిక్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో సాధిక్ ను ఎదిరించే ధైర్యం లేక ఏఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
