AP Govt : ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం
AP Govt New Pensions : రాష్ట్రంలో కొత్త మూడు లక్షల మందికి పింఛన్లు అందించేలా ఏపీలోని కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది.
CM Chandrababu Naidu
AP Govt New Pensions : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతీనెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే, పింఛన్ల అంశంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో అర్హత కలిగిఉండి పింఛన్లు అందుకోలేని వారికి కూటమి ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. కొత్తగా మూడు లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత వితంతువులు, వృద్ధులకు కొత్త పింఛన్లు అందించనున్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి.. అర్హులైన వారికి అక్టోబర్ నెల నుంచే కొత్త పింఛన్లు పంపిణీ చేసేలా కూటమి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు అయా విభాగాల అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకొని ఇంకా వివిధ విభాగాల్లో పింఛన్లకు ఎంత మంది అర్హలున్నారనేది ప్రభుత్వం గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల మంది వితంతువులు అర్హత కలిగి ఉన్నట్లు అంచనా వేయగా.. మరో 1.50లక్షల పింఛన్లను వృద్ధులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, అర్హత కలిగిన వారి జాబితాను పలుసార్లు పరిశీలన తరువాత.. వారు సమర్పించిన పత్రాలను ఆధారంగా పింఛన్లు అందజేయనున్నారు.
చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిపరమైన పింఛను కేటగిరీ వారి వివరాలు కూడా ఆయా శాఖల నుంచి ప్రభుత్వం సేకరిస్తోంది. అదేవిధంగా దివ్యాంగుల కేటగిరి పింఛన్లకు సంబంధించి అర్హులైన వారి వివరాలనూ సేకరిస్తోంది. అయితే, వీరిలో అర్హతను ఎలా నిర్ధారించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా వచ్చే కొద్ది నెలల్లో విడదల వారిగా దాదాపు మూడు లక్షల కొత్త పింఛన్లు అందించేలా ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
