Earth Quake
Earthquake: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో.. మళ్లీ భూమి కంపించింది. గడిచిన 2 వారాల్లో ఇలా భూకంపం రావడం.. ఇది ఏడోసారి. తరచుగా వస్తున్న భూ ప్రకంపనలతో బాధిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్ఛాపురంతో పాటు.. కవిటి, కంచిలి మండలాల్లో తరచుగా భూమి కంపిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాజా ఘటనతో.. ఈ ప్రాంతాల్లో రోజు విడిచి రోజు భూమి కంపిస్తోందని ఆందోళన చెందుతున్నారు.
గత 60 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి భూ ప్రకంపనలు తాము చూడలేదని.. స్థానికులు చెప్పారు. శాస్త్రవేత్తలు సరైన అధ్యయనం చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. అర్థరాత్రి భూమి కంపిస్తోందని.. ఆ సమయంలో ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదని కంగారు పడుతున్నారు.
మరోవైపు.. భూకంప తీవ్రతపై అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.
Read More:
School Holidays : కరోనా ఎఫెక్ట్.. మరో రెండు వారాలపాటు బడులు బంద్..?