TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
తిరుమల(TTD Alert) శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
- V Santhosh Kumar
- Published on- June 15, 2026 / 08:43 PM IST
Alert for Tirumala devotees Srivari Arjitha Sevas cancelled.
- ఈనెల 26 నుంచి జ్యేష్టాభిషేక వేడుకలు.
- శ్రీవారికి వజ్ర ముత్యాల కవచాలంకరణ.
- ఈనెల 28న ఆర్జిత సేవలు రద్దు.
TTD Alert: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి ప్రాచీన ఉత్సవమూర్తులు అభిషేకరాపిడి వల్ల అరిగిపోకుండా పరిరక్షించేందుకు ప్రతి ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేలా ఈ విశిష్ట ఉత్సవాన్ని జరపడం ఒక పవిత్రమైన ఆనవాయితీ. ‘అభిద్యేయక అభిషేకం’ అని కూడా పిలిచే ఈ క్రతువును ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ బృహత్తర వేడుకల కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28వ తేదీన జరగాల్సిన శ్రీవారి ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం(TTD Alert) వంటి ప్రత్యేక సేవలను ఆలయ అధికారులు పూర్తిగా రద్దు చేశారు.
Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముకేశ్ అంబానీ పూజలు.. రూ.10 కోట్ల భారీ విరాళం
ఈ మూడు రోజుల వేడుకల్లో భాగంగా మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికున్న మూల బంగారు కవచాన్ని తొలగించి, విశేష హోమాలు, పంచామృత స్నపన తిరుమంజనం జరిపిన అనంతరం స్వామివారిని అత్యంత దేదీప్యమానమైన వజ్రకవచంతో అలంకరిస్తారు. రెండవ రోజు శ్రీవారికి ముత్యాల కవచ సమర్పణ జరుగుతుంది. ఇక చివరి రోజైన మూడవరోజు తిరుమంజనాది క్రతువులన్నీ వైభవంగా పూర్తి చేసిన తర్వాత స్వామివారికి తిరిగి బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ ఉత్సవంలో ధరింపజేసే ఈ సువర్ణ కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం వరకు తీయరు. తదుపరి సంవత్సరం వరకు శ్రీవారు ఈ బంగారు కవచ ధారణతోనే నిత్యం భక్తులకు దర్శనమిస్తూ వివిధ వాహన సేవలలోనూ, ఉత్సవాలలోనూ పాల్గొంటారు.
