Sand Mining Scam: జగన్ హయాంలో గనులశాఖ అక్రమాలపై ఈడీ ప్రకటన..!
ఇసుక టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. కొన్ని కంపెనీలకు గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అనుకూలంగా వ్యవహరించినట్లు ఈడీ కనుగొంది.
- Naveen
- Updated on- May 30, 2026 / 01:54 AM IST
Sand Mining Scam: జగన్ హయాంలో గనుల శాఖ అక్రమాలపై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ప్రకటన విడుదల చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. ఈ నెల 26న హైదరాబాద్, జయపుర, కోయంబత్తూర్ లో 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ప్రతిమ, జీసీకేసీ, టర్న్ కీ కంపెనీల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. బోయిన్‌పల్లి శ్రీనివాసరావు, అశోక్‌కుమార్, వెంకటరెడ్డి ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు చేసింది. ఇసుక టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. కొన్ని కంపెనీలకు గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అనుకూలంగా వ్యవహరించినట్లు ఈడీ గుర్తించింది. 2వేల 407 కోట్లకు సంబంధించిన లెక్కలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా దర్యాఫ్తు కొనసాగిస్తోంది ఈడీ.
ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో రూ.1.53 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.1.30 కోట్ల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేస్తున్నారు. ఇక స్థిర, చరాస్తుల కీలక పత్రాలు, 1800 డాలర్లు సీజ్ చేసింది ఈడీ. రూ.2,407 కోట్ల ఒప్పందాలకు సంబంధించిన లెక్కలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది ఈడీ. గనుల శాఖలో భారీ అవకతవకలు జరిగాయన్న అనుమానాలతో దర్యాప్తు ముమ్మరం చేసింది.
