×
Ad

Ambati Mounika: మా నాన్న గొంతు నొక్కడానికే ఈ దాడి, పవన్ కల్యాణ్ చెప్పిన మహిళల రక్షణ ఇదేనా? అంబటి మౌనిక

తాను మాట్లాడిన మాటలు తప్పు అని అంబటి రాంబాబే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. తప్పుని తప్పు అని చెప్పేంత దమ్ము ఎవరికి ఉంటుంది?

  • Published On : February 2, 2026 / 05:21 PM IST

Ambati Mounika

  • ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు?
  • పవన్ కల్యాణ్ వాళ్ళవైపే ఉన్నారని, ఆయన బలం చూసి మాపై దాడి చేశారు
  • మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపైనే దాడులు

Ambati Mounika: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి అంశంపై అంబటి కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా మాపై దాడి జరుగుతోందని అంబటి కూతురు అంబటి మౌనిక ఆరోపించారు. తన తండ్రి పోస్టర్లు చించడానికి వెళ్ళలేదని చెప్పారు. తన తండ్రిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని వాపోయారు. అసభ్యకరమైన భాషతో రాంబాబు కారుపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి. ఆయనను రెచ్చగొట్టారు. తాను మాట్లాడిన మాటలు తప్పు అని అంబటి రాంబాబే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. తప్పుని తప్పు అని చెప్పేంత దమ్ము ఎవరికి ఉంటుంది? ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు. గల్లా మాధవిని అడుగుతున్నా. ఏ నైతిక విలువలతో ఎమ్మెల్యే క్షమాపణ అడుగతున్నారు‌. నేను రాంబాబు వ్యాఖ్యలను సమర్థించడం లేదు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు? హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి.

మేము అధికారంలో లేము అని దాడి చేశారు..

కాపు కులస్తులు వాళ్ళ వెంటే ఉన్నారని మాపై దాడి చేశారు. పవన్ కల్యాణ్ వాళ్ళవైపే ఉన్నారని ఆయన బలం చూసి మాపై దాడి చేశారు. లకారాలతో మా గురించి మాట్లాడారు. జగన్ గురించి చంద్రబాబు…. ఆయన పుట్టుకే తప్పు అని అనలేదా? మేము వైసీపీ అని, అధికారంలో లేము అని దాడి చేస్తున్నారు. దేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారు.

అంబటి రాంబాబు గొంతు నొక్కే ప్రయత్నం..

గల్లా మాధవికి కుటుంబం ఉంది. ఆమెను పావుగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని బలి పశువును చేస్తున్నారు. మీ ఆత్మసాక్షికే వదిలేస్తున్నా. పవన్ కల్యాణ్ మహిళల రక్షణ గురించి చాలాసార్లు చెప్పారు. రాంబాబు దేని గురించీ భయపడరు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి మహిళలపై దాడి చేస్తున్నారు. రాంబాబుని స్టేషన్ లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు. పోలీసులు అల్లరి మూకలను కంట్రోల్ చేయలేదు. రాంబాబు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన గొంతు నొక్కడానికే దాడి చేశారు‌.

సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమేనా?

చంద్రబాబును నేను అనలేదు అని రాంబాబే చెప్పారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్‌. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమేనా? దీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు నిజానికి భయపడతారు. ఇటువంటి దాడులకు పాల్పడరు‌. మా భద్రత గురించి ఆయన ఆందోళన చెంది ఉంటారు. గల్లా మాధవి డైరెక్షన్ తోనే మాపై దాడి చేశారు” అని అంబటి కూతురు మౌనిక అన్నారు.

Also Read: నాకు ఏం జరిగినా ఆయనే కారణం.. అందరినీ గుర్తిస్తాం, ఎవరినీ వదలం- జోగి రమేశ్