ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మళ్లీ అంబటి సెటైర్లు.. ఈసారి ఏమన్నారంటే?

ఎక్కడ నెగ్గాలో తెలియనోడు.. ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు.. అంటూ మాజీ మంత్రి, వైసీప ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

Ambati Rambabu : తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాబు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీకోసం ఇప్పటికే ఒక పార్లమెంట్ సీటును వదులుకున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీ సీట్ల విషయంలోనూ బీజేపీకోసం మూడు స్థానాలు వదులుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమిలో జనసేన పార్టీకి అన్యాయం జరిగిందని, సీట్లు తక్కువ కేటాయించారంటూ అధికార పార్టీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సానుభూతి చూపుతూ సెటైరికల్ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మరో మూడు అసెంబ్లీ స్థానాలను పవన్ వదులుకున్నాడన్న వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు.

Also Read : YCP Manifesto : వైసీపీ మ్యానిఫెస్టోని సిద్ధం చేసిన సీఎం జగన్

ఎక్కడ నెగ్గాలో తెలియనోడు.. ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు.. అంటూ పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ అంబటి రాంబాబు ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. గత కొద్దిరోజులుగా అంబటి రాంబాబు పవన్ పై వరుస ట్వీట్లు చేస్తున్నారు. సీఎం సీఎం అని అరిసిన ఓ కాపులారా! సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? సీఎం అంటే చీటింగ్ మనిషా? అంటూ అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Also Read : Ambati Rambabu : జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ మంత్రి అంబటి ట్వీట్..!

ట్రెండింగ్ వార్తలు