Ys Jagan: అంబటి రాంబాబు నివాసానికి జగన్.. కుటుంబసభ్యులకు పరామర్శ
- అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించిన జగన్
- పార్టీ అండగా ఉంటుందని అంబటి కుటుంబానికి భరోసా
- జగన్ తో పాటు భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, సామాన్యులు
Ys Jagan: గుంటూరులో మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. అంబటి ఇంటిపై జరిగిన దాడి ప్రదేశాలను జగన్ పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు జగన్. అంబటి కుటుంబసభ్యులతో మాట్లాడిన జగన్ దాడి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు జగన్.
మరోవైపు జగన్ తో పాటే వైసీపీ శ్రేణులు, సామాన్యులు భారీగా తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రోప్, బారికేడ్లను తోసుకుంటూ పలువురు ముందుకొచ్చారు. ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.
Also Read: పవన్ కల్యాణ్ తెలంగాణ ద్రోహి.. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే..: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్
