Ambati Rambabu : జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ మంత్రి అంబటి ట్వీట్..!
Ambati Rambabu : జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ట్విట్టర్ (X) వేదికగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
- Sreehari A
- Published On : March 10, 2024 / 12:21 AM IST
Ambati rambabu Viral Tweet On Pawan Kalyan, Chandrababu
Ambati Rambabu : ఆంధప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి పోటీగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. మూడు పార్టీలు ఏకమై వైసీపీతో పోటీకి సై అంటున్నాయి. ఇందుకోసం చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే మకాం పెట్టి బీజేపీ అగ్ర నేతలతో పలుమార్లు సమావేశమయ్యారు. పొత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పలుదఫాలుగా చర్చలు జరిపిన అనంతరం సంయుక్త ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Read Also : Telangana Congress : ఒకే ఛాన్స్..! టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో కొత్త రూల్..!
ఈ క్రమంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు విపక్షాల పొత్తులకు సంబంధించి తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా వ్యంగంగా ప్రశ్నించారు.
CM CM అని అరిసిన ఓ కాపులారా!
CM అంటే చీఫ్ మినిస్టరా?
CM అంటే సెంట్రల్ మినిస్టరా?
CM అంటే చంద్రబాబు మనిషా?
CM అంటే చీటింగ్ మనిషా ?@ncbn @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) March 9, 2024
సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా.. సీఎం అంటే ఛీఫ్ మినిస్టరా ?, సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా ? సీఎం అంటే చంద్రబాబు మనిషా?, సీఎం అంటే చీటింగ్ మనిషా? అని అంబటి ట్వీట్ చేశారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై మంత్రి అంబటి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Read Also : Tdp Janasena Bjp Alliance : పవన్ కల్యాణ్ త్యాగం..! ఎట్టకేలకు బీజేపీ-టీడీపీ మధ్య స్నేహానికి బీజం
