AP Covid Cases : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 122 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 122 మందికి కోవిడ్ సోకింది. అదే సమయంలో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Ap Covid Cases Up Date

AP Covid Cases  : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 122 మందికి కోవిడ్ సోకింది. అదే సమయంలో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ వల్ల నిన్న విశాఖ పట్నంలో ఒకరు మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.

ఇంతవరకు రాష్ట్రంలో 3,13,97,635 శాంపిల్స్ ను పరీక్షించగా 20,77,608 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 20,61, 832 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,278 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 14,498 కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కోవాగ్జిన్‌ వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు. ఈ నెల 7వరకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగనుంది.

Ap Covid Up Date