AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

అలాగే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

  • Updated on- April 30, 2026 / 05:59 PM IST

AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాజధాని అమరావతి ప్రాంతంలో నిలిచిపోయిన పలు నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలన అనుమతుల మంజూరుపై చర్చించారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలకు భూకేటాయింపులు చేసే అంశం పైన చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచడంతో పాటు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్టులపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు మంత్రులు.

అలాగే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి నిర్మాణాలపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిర్మాణ ఖర్చులపై దుష్ప్రచారాలను ఖండించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇటీవల తలెత్తిన ఇంధన సమస్యపై ప్రజలకు వివరించాలని చెప్పారు. ఇక మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.

Also Read: ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే.. పేపర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఇలా చేయండి..

ఉదయం 10.30కు ప్రారంభమైన క్యాబినెట్ సమావేశం మధ్యాహ్నం 2.30 వరకు జరిగింది. క్యాబినెట్ అజెండా పూర్తయ్యాక పలు రాజకీయ అంశాలపై తన మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో వైసీపీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇంధన కొరతపై వైసీపీ చేస్తున్న విమర్శలను పూర్తి స్థాయిలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. సోషల్ మీడియాలో ప్రచారం వల్ల ప్రజలు కొంత ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వల్లే సమస్య తలెత్తింది అనే విషయాన్ని వివరించాలన్నారు చంద్రబాబు.

పాలనలో వేగంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సింగపూర్ తరహా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో మంత్రులను ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపిస్తే.. దానిపైనా విమర్శలు చేసే పరిస్థితి గొడ్డలి పార్టీకి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలకు ప్రపంచంలోనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

* హోంశాఖ, పంచాయతీరాజ్, న్యాయ శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు
* రాష్ట్ర స్థాయి న్యాయశాఖలో 21 కొత్త పోస్టులకు క్యాబినెట్ ఆమోదం
* రామాయపట్నం పోర్టుకు రూ.350 కోట్ల అదనపు నిధుల కేటాయింపునకు ఆమోదం
* ఏపీ మార్క్ ఫెడ్ కు రూ.1800 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ
* రూ.124.5 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
* రూ. 1208 కోట్లతో క్వాంటం టవర్స్ నిర్మాణానికి ఏపీ క్యాబినెట్ అనుమతి
* రూ.124.5 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
* రూ.1208 కోట్లతో క్వాంటం టవర్స్ నిర్మాణానికి అనుమతి
* అసెంబ్లీ భవనాల అదనపు పనుల కోసం రూ.789 కోట్ల మంజూరుకు అనుమతి
* కృష్ణా కరకట్టను 4 లైన్ల రహదారిగా మార్చాలని క్యాబినెట్ నిర్ణయం