Annadata Sukhibhava Scheme: నేడే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.3 వేల కోట్లు

అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava Scheme) పథకం కింద తొలి విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా విడుదల చేశారు.

Annadata Sukhibhava funds to be released in Andhra Pradesh today

  • రైతు ఖాతాల్లో రూ.7 వేలు జమ
  • రూ.3,125 కోట్ల నిధుల విడుదల
  • అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం

Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. ‘అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava Scheme) – పీఎం కిసాన్’ పథకం కింద తొలి విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లింగంగుంట్ల నుంచి అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.85 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.3,125 కోట్లు జమ కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో భాగంగా ఈ నిధుల విడుదల ఒక మైలురాయిగా నిలిచింది.

Ap CGF Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికోసం ఏకంగా రూ.10 కోట్లు.. డైరెక్ట్ బ్యాంకులోకి

ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 చొప్పున జమ అవుతాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,342.92 కోట్లను విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్’ వాటా కింద రూ.782.55 కోట్లు సమకూరాయి. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డిబిటి (DBT) పద్ధతిలో బదిలీ కానున్నాయి. పెట్టుబడి సమయానికి ఈ ఆర్థిక సాయం అందడం వల్ల రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక భరోసా ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, రైతు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.