chandrababu, jagan
ఏపీలో స్థానిక పోరు, మున్సిపల్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. లోకల్ బాడీస్, మున్సిపాలిటీల గడువు దగ్గర పడుతుంది. దీంతో స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ అవుతోంది. ఏపీలో సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది. మార్చిలో..కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం అయిపోనుంది. అందుకు తగ్గట్లుగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్‌మెంట్స్‌ను స్పీడప్ చేసింది.
మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక మొదట స్థానిక పోరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఏపీ రాజకీయ వేడి రాజుకుంటోంది. గ్రామాల్లో ఎలక్షన్ హీట్ నెమ్మదిగా పెరుగుతోంది. స్థానిక సమరం పల్లె పోరుతో మొదలై కార్పోరేషన్ పోరుతో ముగించే ప్లాన్ ఉందట. ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని చూస్తున్నారట. ఆ తర్వాత మండల పరిషత్‌లకు, చివరిగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నారట. బడ్జెట్ సెషన్ పూర్తి అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Also Read: మున్సిపోల్స్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు.. ఏమేం జరిగాయంటే?
అయితే స్థానిక సంస్థల సమరానికి టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా సై అంటున్నాయట. జూన్ నాటికి లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలని కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారని అంటున్నారు. ఏపీ బడ్జెట్ కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ రూపొందించారని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అయితే ఏపీలో రాజకీయ వాతావరణం కూటమికి అనుకూలంగా ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి.
అదే మాదిరిగా ఏపీలో కూడా అధికారంలో కూటమికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని..వైసీపీ పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందని..మూడు పార్టీల కూటమి ఫుల్ స్ట్రాంగ్‌గా ఉందని..పైగా వైసీపీ పెద్దగా సంస్థాగతంగా పుంజుకోలేదని కూడా కూటమి పెద్దలు అంచనా వేస్తున్నారట. దాంతో ఇప్పుడు ఎన్నికలు పెడితే నూటికి తొంభై శాతం సీట్లను గెలుచుకోవచ్చన్నది కూటమి ఆలోచనగా చెబుతున్నారు. అదే సమయంలో స్థానిక పదవులు మూడు పార్టీలు పంచుకోవడం ద్వారా గ్రౌండ్ లెవెల్‌లో మరింత గట్టిగా నిలిచేందుకు వీలు కలుగుతుందని కూడా భావిస్తున్నారట.
ఇక విపక్షంలో ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తర్జన భర్జన పడుతోంది అని అంటున్నారు. అసలే ఘోర పరాజయంతో వైసీపీకి బలమైన నాయకులు లేకుండా పోయారు. చాలామంది జంప్ అవగా..ఉన్న కొద్ది మంది నేతలు కూడా సైలెంట్ మోడ్‌లో ఉంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జ్‌లు యాక్టీవ్‌గా లేరు. పైగా ఎక్కడైనా స్థానిక ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయనేది ఓపెన్ సీక్రెట్.
తెలంగాణలోనై సేమ్ సీన్
తెలంగాణలో జరిగింది కూడా అదే. 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నట్లుగా ఫలితాలను సాధించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎన్నికలను లైట్ తీసుకుంది. చాలాచోట్ల లోకల్ లీడర్లే పట్టు కోసం, పరువు కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అదే పరిస్థితిని ఫేస్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే 2024కు ముందు టీడీపీ పరిస్థితి కంటే..ఇప్పుడు వైసీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పాలి.
లిక్కర్ స్కామ్ కేసు, కల్తీ నెయ్యి వ్యవహారం, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలంతా సైలెంట్ అయిపోవడం..ఇలా ఫ్యాన్ పార్టీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోటీ చేసి ఓటమి చెందామని అనిపించుకోవడం కంటే బాయ్ కాట్ చేసి గమ్మున ఉంటే గౌరవంగా ఉంటుందా అన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దలు ఉన్నారట. పలువురు ముఖ్యనేతలు మాత్రం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబడుతుండటంతో వైసీపీ అధి నాయకత్వం తర్జన భర్జన పడుతుందని అంటున్నారు.
అయితే మరో వైపు చూస్తే పోటీకి దిగాల్సిందే అన్న మాట కూడా వినిపిస్తోంది. అవుట్ రైట్‌గా అధికార పార్టీకి వదిలేస్తే వైసీపీ క్యాడర్ డీమోరలైజ్ అయ్యే ప్రమాదం ఉందని..ఇప్పటికే క్యాడర్ చాలా నిరాశలో ఉందని అంటున్నారట పలువురు వైసీపీ నేతలు. లోకల్ బాడీ పోల్స్‌ను లైట్ తీసుకుంటే కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోతారని..ఆ ఫలితాల ప్రభావం జనరల్ ఎలక్షన్స్‌పై కనిపించే అవకాశం ఉందని అంటున్నారట.
దాదాపుగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి మీద ప్రజా వ్యతిరేకత ఉందని అధి నాయకత్వం సీరియస్‌గా ఫోకస్ చేసి..గట్టి అభ్యర్థులను పెట్టి పోరాడితే..చెప్పుకోదగ్గర ఫలితాలు సాధించే అవకాశం ఉందని వాదించేవారున్నారట. తెలంగాణాలో ఎంత అధికార కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా చెప్పుకోదగిన ఫలితాలను సాధించాయని గుర్తు చేస్తున్నారట పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు.
పైగా క్యాడర్ జోష్ పెరుగుతుందని..ఏపీలో వైసీపీకి కూడా ఇది చాలా అవసరం అని కూడా అంటున్నారు. అయితే వైసీపీ అధినేతతో సహా ముఖ్యనేతలంతా స్థానిక పోరు విషయంలో డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగితే రాజకీయ పరిస్థితి ఎలా ఉంటాయో చూడాలి మరి.