AP Schemes: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త చెప్పిన కూటమి సర్కార్.. బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చేస్తున్నాయ్..
Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- September 26, 2026 / 12:05 PM IST
Andhra Pradesh Government to Credit Annadata Sukhibhava Scheme Funds by October 17
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అన్నదాతలకు ఆర్థికంగా భరోసాగా నిలిచేందుకు అమలుచేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులను వచ్చే నెలలో అంటే దసరా పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్ 17న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేసింది.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు మూడు విడతల్లో జమ చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ( రెండు విడతల్లో రూ.5వేలు చొప్పున, ఒక విడతలో రూ.4వేలు) రూ.14 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని విడతల వారీగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఆ సమయంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 వేల చొప్పున అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేల చొప్పున కలిపి ఈ మొత్తం జమ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు సుమారు రూ.3,125.47 కోట్ల నిధులు అందాయి.
రెండో విడత నగదును జమ చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 17న నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత వినాయక చవితి సందర్భంగా నిధులు జమ చేసే అంశాన్ని పరిశీలించినప్పటికీ.. దసరా నాటికి విడుదల చేయడం ద్వారా రైతులకు పండుగ కానుకగా ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తుంది.
పీఎం కిసాన్ పథకం నిధులను కేంద్రం విడుదలచేసే రోజే రాష్ట్ర ప్రభుత్వంకూడా అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతులకు ఒకేరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంబంధించిన ఆర్థిక సాయం అందే అవకాశం ఉంది. అయితే, తదుపరి విడతలో పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, రాష్ట్ర వాటాగా రూ.4 వేలు కలిపి రూ.6 వేల వరకు జమ కానున్నట్లు సమాచారం.
అన్నదాత సుఖీభవ పథకం నిధులు పొందాలంటే e-KYC పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇంకా పూర్తి చేయని రైతులకు తదుపరి విడత నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
