Thalliki Vandanam: తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు.. ‘తల్లికి వందనం’ డేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం(Thalliki Vandanam)’ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
- V Santhosh Kumar
- Published on- June 26, 2026 / 09:55 PM IST
Andhra Pradesh government to release Thalliki Vandanam funds on July 10
- ‘తల్లికి వందనం’ డేట్ ఫిక్స్
- జులై 10న నిధుల విడుదల.
- ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరి.
Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం(Thalliki Vandanam)’ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో జులై మూడో వారంలో ఈ నగదును రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అంతకంటే ముందుగానే జులై 10వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఒక్కొక్కరికి రూ.13 వేలు:
ఈ పథకం కింద ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి ఒక్క విద్యార్థికి రూ.13,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అయితే, ఈ నిధులు సకాలంలో నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడాలంటే లబ్ధిదారులు ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి ఉంటుంది. తల్లులు, విద్యార్థులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే జులై 10న ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు అందుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నమైంది.
