Shani Trayodashi: రేపే ‘శని త్రయోదశి’.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. ఇలా చేస్తే అనుగ్రహం తప్పనిసరి!
శని త్రయోదశి(Shani Trayodashi) రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. శని ప్రదోషం అనేది దీనికి ఉన్న మరో పేరు.
Shani Trayodashi special features, rules to follow and not to follow
- జూన్ 27న శని త్రయోదశి.
- శని దేవుడి కళ్లల్లో చూడొద్దు.
- ఈదురు రోజున వస్తువులు కొనొద్దు.
Shani Trayodashi: శని త్రయోదశి.. ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జూన్ 27న శని త్రయోదశి రానుంది. శని ప్రదోషం అనేది దీనికి ఉన్న మరో పేరు. ఈ విశేష పర్వదినాన అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు శని దేవునికి తైలాభిషేకం చేయడం, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం లాంటి పరిహారాలు పాటిస్తారు. శని త్రయోదశి రోజున కొన్ని ప్రత్యేకత పద్దతులను ఆచరించడం వల్ల శని దేవుని దుష్ప్రభావాల తీవ్రత తగ్గుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే, ఈ రోజున అవగాహన లేక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శని పీడ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి శని త్రయోదశి నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ తప్పులు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఈ తప్పులను అస్సలు చేయకండి:
* శని త్రయోదశి(Shani Trayodashi) పర్వదినాన ఇనుము లేదా ఇనుప వస్తువులను కొనుగోలు చేయడం వల్ల గృహంలో దరిద్రం, మానసిక ఇబ్బందులు పెరుగుతాయి.
* శని దేవుని పూజకు నూనెను సమర్పిస్తారు, కానీ ఈ రోజున నూనె కొనడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు వస్తాయని నమ్ముతారు. కాబట్టి, నూనెను ఒక రోజు ముందే కొని ఉంచుకోవడం మంచిది.
* అలాగే ఈ రోజున నల్ల నువ్వులు, తోలుతో చేసిన వస్తువులు, చెప్పులు, బూట్లు వంటి వాటిని అస్సలు కొనకూడదు.
* ఆలయానికి వెళ్ళిన సమయంలో శని దేవుని కళ్లలోకి నేరుగా చూడటం చేయకూడదు.
* దానికి బదులుగా శని భగవానుని పాద పద్మాలను దర్శిస్తూ ప్రార్థనలు, ప్రదక్షిణలు చేయాలి.
* ఆయన కళ్లలోకి సూటిగా చూడటం అరిష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
* శని త్రయోదశి నాడు సంపూర్ణ సాత్విక జీవనాన్ని గడపడం ఎంతో ముఖ్యం.
* అలాగే, ఈరోజున మాంసాహారం, మద్యం, గుడ్లు వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి.
* ఎలాంటి మత్తు పదార్థాలను తీసుకోకూడదు.
* ఒకవేళ మీరు ఉపవాస దీక్షలో ఉన్నా లేదా ప్రత్యేక పూజలు చేస్తున్నా మీ ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా నివారించాలి.
* శని దేవుడు న్యాయానికి అధిపతిగా, సమాజంలోని పేదలకు, కార్మికులకు, వృద్ధులకు, నిస్సహాయులకు ప్రతిరూపంగా నిలుస్తాడు.
* ఈ పవిత్ర రోజున వృద్ధులను, యాచకులను, పారిశుధ్య కార్మికులను లేదా మూగజీవాలను హింసించడం, దూషించడం చేయకూడదు.
* అలా చేయడం వల్ల శుభ ఫలితాలు రాకపోగా, శని దేవుని తీవ్ర ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
* శని త్రయోదశి సాయంసంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద, పడమర దిక్కున ఎలాంటి చీకటి లేకుండా వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
* సాయంత్రం వేళ ఆలయంలో, ఇంటి ముంగిట తప్పనిసరిగా దీపారాధన చేయాలి.
* అలాగే ఈ రోజున అబద్ధాలు ఆడటం, ఇతరులను వంచించడం, వడ్డీ డబ్బులు వసూలు చేయడం వంటి పనులను అసలు చేయకూడదు.
ఆ శని దేవుని కృపాకటాక్షాలు లభించాలంటే ఇలా చేయండి:
* శని త్రయోదశి రోజున ఉదయం లేదా సాయంత్రం రావి చెట్టు వద్ద ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి.
* అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేసి ‘‘ఓం షణ్ శనైశ్చరాయ నమ:’’ అనే శక్తివంతమైన మంత్రాన్ని జపించాలి.
* మీ శక్తానుసారం పేద సాధువులకు మినపప్పు, నల్లటి దుప్పట్లు లేదా కాళ్లకు చెప్పులను దానంగా ఇవ్వడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి.
