×
Ad

AP Covid : ఏపీలో కరోనా, 40 మందికి వైరస్.. నాలుగు జిల్లాల్లో సున్నా కేసులు

ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,19,407 పాజిటివ్ కేసులకు గాను…

  • Published On : March 25, 2022 / 06:35 PM IST

Ap Corona

Andhra Pradesh Covid 19 Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో రికార్డవుతున్నాయి. ఇప్పుడు 50 కేసుల కంటే తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి ప్రజలు బయటపడుతున్నారు. కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది.

Read More : Telangana Corona : తెలంగాణలో అదుపులో కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే

ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,19,407 పాజిటివ్ కేసులకు గాను…23,04,248 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇప్పటి వరకు 14,730 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 429గా ఉందని తెలిపింది. 10 వేల 515 శాంపిల్స్ పరీక్షించగా…40 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 55 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,33,81,540 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : AP Corona News : ఏపీలో కొత్తగా 31 కరోనా కేసులు

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 15. చిత్తూరు 01. ఈస్ట్ గోదావరి 10. గుంటూరు 00. వైఎస్ఆర్ కడప 01. కృష్ణా 01. కర్నూలు 00. నెల్లూరు 00. ప్రకాశం 01. శ్రీకాకుళం 01. విశాఖపట్టణం 07. విజయనగరం 00. వెస్ట్ గోదావరి 03. మొత్తం :- 40