ఏపీ ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు.. చైర్మన్‌గా నారా లోకేశ్
రెండేళ్ల కాలపరిమితితో ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఫోరం వ్యవహరించనుంది.
- Harish Thanniru
- Updated on- September 29, 2024 / 11:37 AM IST
Nara Lokesh
AP Government: రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 20లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నం.58ని విడుదల చేసింది. ఫోరం చైర్మన్ మంత్రి నారా లోకేశ్ ను నియామకం అయ్యారు. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read : టీటీడీ బోర్డుకు బ్రేక్ ఎందుకు పడింది? సభ్యుల నియామకం ఆ తర్వాతేనా?
రెండేళ్ల కాలపరిమితితో ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఫోరం వ్యవహరించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆప్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్దరించింది. వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
