Andhra Pradesh three Liquor Bottles : ఏపీలో మద్యం విషయంలో ఉన్న చట్టాన్ని సవరణించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తుండడంతో ప్రభుత్వం పై విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే..మూడు సీసాలైనా..అనుమతించకూడదని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది.
ఈ మేరకు చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో వ్యక్తి గరిష్టంగా..మూడు సీసాలు వరకు మద్యం నిల్వ ఉంచుకొనేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదని గత సంవత్సరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది ఇతర రాష్ట్రాలు (తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా) రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లుతెచ్చుకుంటున్నారు. వీరిపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు కేసులు నమోదు చేశారు.
ఒక్కొక్కరి వద్ద గరిష్టంగా..మూడు లిక్కర్ బాటిళ్లు ఉండొచ్చని ప్రభుత్వమే వెల్లడించినప్పుడు..అవి ఏపీలో కొనుగోలు చేసినా..ఇతర రాష్ట్రాల్లో కొనుక్కొన్నా నేరం ఎలా అవుతుందని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారిగా..ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. మూడు సీసాల చొప్పున తెచ్చుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తించారు అధికారులు.
ఈ నేపథ్యంలో మూడు సీసాల నిబంధన మార్చుతూ చట్ట సవరణ చేయడంతో పాటు..ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొనే మద్యంపై అదనపు పన్ను విధించాలని ప్రతిపాదించి. మరి ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? లేదా ? అనేది చూడాలి.