Pakistan Terror Links: ఏపీలో ఉగ్ర కలకలం.. యువకుడు అరెస్ట్.. ఏకంగా 29 టెర్రరిస్ట్ గ్రూపుల్లో మెంబర్.. ఇంకా..

దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్.. స్థానిక యువతను టెర్రరిజంవైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు.

Pakistan Terror Links: ఏపీలో ఉగ్ర కలకలం.. యువకుడు అరెస్ట్.. ఏకంగా 29 టెర్రరిస్ట్ గ్రూపుల్లో మెంబర్.. ఇంకా..

Updated On : August 16, 2025 / 7:13 PM IST

Pakistan Terror Links: టెర్రర్ లింకులు ఏపీలో కలకలం రేపాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు వెలుగుచూడటం భయాందోళన కలిగిస్తోంది. ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదైంది. మూడు రోజుల క్రితమే నూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్ టచ్ లో ఉన్నట్లు గుర్తించారు.

టెర్రరిస్టులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేసినట్లు విచారణలో తెలుసుకున్నారు. దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్.. స్థానిక యువతను టెర్రరిజంవైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో అతడిపై దేశద్రోహం, ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. రేపటిలోగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

నూర్ మహమ్మద్ తో పాటు ఎర్రగుంటకు చెందిన రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో లింకులకు సంబంధించి వారిని విచారిస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని నేలకోటలో నూర్ మహమ్మద్ నివాసం ఉంటాడు. ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఇవాళ ఉదయం నూర్ ను అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

అనుమానిత వస్తువులను సీజ్ చేశారు. ఉదయం 7 గంటల నుంచి ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో నూర్ మహమ్మద్ ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో నూర్ టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ కు చెందిన 29 ఉగ్రవాదుల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నాడు.

నూర్ ఎప్పటి నుంచి పాక్ ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నాడు? గ్రూపుల్లో ఎప్పటి నుంచి మెంబర్ గా ఉన్నాడు? అతడికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఈ వివరాలు తెలుసుకునే పనిలో ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. నూర్ తో పాటు ఎర్రగుంటకు చెందిన రియాజ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధర్మవరంలో ఉగ్రవాద కదలికల వ్యవహారం కలకలం రేపింది. పాక్ టెర్రరిస్టులతో నూర్ కు లింకులు ఉన్నాయని తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. నూర్ మహమ్మద్ గత మూడేళ్లుగా ధర్మవరం పట్టణంలోని లోన్ కోట్ లో నివాసం ఉంటున్నాడు. నూర్ తో పాటు అతడి తల్లి, భార్య, నలుగురు చెల్లెళ్లు, ముగ్గురు పిల్లలు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే కుటుంబంతో గొడవపడ్డ నూర్ 6 నెలలుగా వారికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు.

ధర్మవరం మార్కెట్ యార్డులోని ఒక హోటల్ లో నూర్ వంట మాస్టర్ గా పని చేస్తున్నాడు. నూర్ స్నేహితులు, అతడు ఎవరెవరితో టచ్ లో ఉన్నాడు, ఎవరెవరితో వాట్సాప్ లో చాట్ చేశాడు అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. పాక్ ఉగ్రవాదులతో నూర్ ఏం మాట్లాడాడు, వారికి ఏయే సమాచారం చేరవేశాడు అన్నది ఆరా తీస్తున్నారు పోలీసులు.

Also Read: వామ్మో.. ఇన్ని దారుణాలా..! సృష్టి కేసులో మరో బిగ్‌ట్విస్ట్‌.. నమ్రతా క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు