×
Ad

Visakhapatnam: వైజాగ్‌లో హై-ఎండ్ కార్లకు రూ.31 లక్షల జరిమానా

విశాఖ నగరంలో రవాణా శాఖ అధికారులు Life Tax చెల్లించని 37 హై-ఎండ్ కార్లకు 31 లక్షలు జరిమానా విధించింది.

  • Published On : August 25, 2021 / 09:43 AM IST

Vizag

VISAKHAPATNAM: విశాఖ నగరంలో రవాణా శాఖ అధికారులు జీవిత పన్ను(Life Tax) చెల్లించని 37 హై-ఎండ్ కార్లకు 31 లక్షలు జరిమానా విధించింది. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో వైజాగ్ నగరంలో తిరుగుతున్న వాహనాల కోసం గత నాలుగు రోజులుగా నగరంలోని బీచ్ రోడ్, గాజువాక మరియు ఇతర ప్రాంతాల్లో రోడ్డు రవాణా సంస్థ(RTA) అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజరత్నం మాట్లాడుతూ.. హై-ఎండ్ కార్లపై దృష్టి పెట్టామని, జరిమానాలు విధించామని చెప్పారు. జీవిత పన్ను చెల్లించని వాహనాల కోసం తనిఖీలు నిర్వహించగా.. మొత్తం 37 హై-ఎండ్ కార్లు గుర్తించి, సరైన పత్రాలు లేని కారణంగా మొత్తం 31లక్షల జరిమానా విధించారు. ఆర్టీఓ జయ ప్రకాష్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు వి.ప్రకాశరావు, ఆర్ అనిల్, బి.రాజారావు, టి.వేణుగోపాల్, తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.