Anna Lezhneva: ఎన్నో అవమానాలు.. ఇంకెన్నో భావోద్వేగ క్షణాలు.. పవన్‌ పొలిటికల్ జర్నీపై భార్య ఎమోషనల్ పోస్ట్

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన ఒంటరి పోరాటం ఎంతో కఠినంగా సాగింది అంటూ ఆయన సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhneva) ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Anna Lezhneva shares an emotional post about her husband Pawan Kalyan political journey

  • పవన్ రాజకీయ ప్రయాణం భావోద్వేగం
  • అన్నా లెజినోవా కన్నీటి పోస్ట్ వైరల్
  • ఒంటరి పోరాటం నుంచి విజయానికి ప్రయాణం

Anna Lezhneva: పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన ఒంటరి పోరాటం ఎంతో కఠినంగా సాగింది అంటూ ఆయన సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhneva) ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త పవన్ కల్యాణ్, పిల్లలతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకునే వరకు ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఓటములు, విమర్శలు అన్నీ గుర్తు చేసుకున్నారు.

Train Timings: తిరుపతి ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. ఈ వివరాలు తెలుసుకోండి!

పవన్ కల్యాణ్ చేసిన రాజకీయ ప్రయాణం సులభం కాదని ఆమె పేర్కొన్నారు. గతంలో జనసేన పార్టీ అనేక ఎన్నికల్లో పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన వెనకడుగు వేయలేదని చెప్పారు. విజయం వెనుక కనిపించని కష్టాలు, అవమానాలు, అనిశ్చితి చాలా ఉన్నాయని, ప్రపంచం ఆయనకు వ్యతిరేకంగా ఉన్న రోజులు కూడా వచ్చాయని ఆమె వివరించారు. అయినప్పటికీ ఆయన తన పోరాటాన్ని కొనసాగించారని అన్నారు.

పవన్ బయట రాజకీయ పోరాటాలు చేస్తుంటే, తాను ఇంట్లో పిల్లల కోసం ధైర్యంగా ఉండాల్సి వచ్చిందని అన్నా లెజినోవా తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒంటరితనం, భయం కూడా అనుభవించినట్లు చెప్పారు. అయితే 2024లో డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన క్షణం తనకు ఎంతో భావోద్వేగంగా అనిపించిందని, అది కేవలం రాజకీయ విజయం కాకుండా మానవతా విజయం అని ఆమె పేర్కొన్నారు. ఆ క్షణంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని, అది ఆనందబాష్పాలని ఆమె భావోద్వేగంగా వివరించారు.