Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్.. అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా..? వెంటనే ఇలా చేయండి..

Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అర్హులైన 46.85లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది.

Annadata Sukhibhava

  • అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల
  • మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదా
  • డబ్బులు పడని రైతులు అధికారులను సంప్రదించండి

Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 13వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేశారు. అయితే, ఈ పథకం కింద అర్హులైన రైతుల్లో కొందరి బ్యాంక్ ఖాతాల్లోకి ఇంకా డబ్బులు రాలేదు. అలాంటి వారికి వ్యవసాయశాఖ అధికారులు కీలక సూచనలు చేశారు.

Also Read : Drug Party : ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ సహా పలువురు వీఐపీలు.. ఐదుగురికి పాజిటివ్..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో రూ.6,309 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయగా.. తాజాగా.. మూడో విడత కింద మరో రూ.2,675.97కోట్లను అర్హులైన 46.85లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో రూ.8,985కోట్లు రైతులకు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద విడుదలైన డబ్బులు తమ బ్యాంక్ ఖాతాలో పడ్డాయా..? ఏ బ్యాంకులో పడ్డాయి అనే విషయాలను స్టేటస్ చెక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్‌‌లోకి వెళ్లాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే.. హోం స్ర్కీన్ మీద.. Know Your Status అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత రైతులు తమ ఆధార్ కార్డు నంబర్ వివరాలను నమోదు చేసి.. కాప్చా ఎంటర్ చేసి అనంతరం బటన్ మీద క్లిక్ చేయాలి. దీంతో రైతుల వివరాలు కనిపిస్తాయి.

అన్నదాత సుఖీభవ నిధులు పలువురు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదని తెలుస్తోంది. పథకం కింద అర్హత కలిగి ఉండి డబ్బులు రానివారు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ అధికారులను సంప్రందించాలి. పథకంకు అర్హత కలిగి ఉండి బ్యాంకులో డబ్బులు జమకాకపోవటానికి పలు కారణాలు ఉన్నాయి. పేరు తప్పుగా ఉన్నా.. ఆధార్ నెంబర్‌లో తేడాలు ఉన్నా, ఆధార్ నెంబర్ బ్యాంక్‌తో లింక్ కాకపోయినా.. ఆధార్ ఈకేవైసీ పూర్తి కాకపోయినా.. బ్యాంక్ అకౌంట్ ఎన్పీసీఐలో మ్యాప్ కాకపోయినా డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడకపోవటానికి కారణాలై ఉంటాయి. ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాలను తెలుసుకునేందుకు స్థానిక రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో పాటు బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే సమస్యను పరిష్కరించుకోవచ్చు.