Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం.. నిశ్చితార్థ వేడుకకు వెళ్తుండగా యాక్సిడెంట్
ట్రాక్టర్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- bheemraj
- Published On : March 27, 2022 / 04:27 PM IST
Accident (1)
Another road accident : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాద ఘటన మరిచిపోకముందే జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్లులో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. దామలచెరువులో ఓ నిశ్చితార్థ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా…ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి వెళుతుండగా ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు ఈ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలించారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శనివారం(మార్చి26,2022)వ తేదీ ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు.
Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ పెళ్లి బస్సు, 10మంది మృతి
ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం జరిగింది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపువద్ద అదుపు తప్పి కుడివైపు లోయలోకి బస్సు దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోధించారు. ఒకరిపై మరొకరు పడి కాళ్లు చేతులు విరిగాయి. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.
