PM Modi : చిత్తూరు బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు

మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.

PM Modi : చిత్తూరు బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు

Bus Accident

Chittoor bus accident : చిత్తూరు జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. బస్సు ప్రమాదం సీఎం జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

గాయపడి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు. బాధితులు కోలుకునేంతవరకు అండగా ఉండాలని ఆదేశాలిచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా…ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి వెళుతుండగా ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.

Bhakarapeta Ghat Road : బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్ర్భాంతి…మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు

ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు ఈ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలించారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 2022, మార్చి 26వ తేదీ శనివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు.

Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ పెళ్లి బస్సు, 10మంది మృతి

ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపువద్ద అదుపు తప్పి కుడివైపు లోయలోకి బస్సు దూసుకెళ్లింది. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.