AP SSC Results 2026 : ఏపీలో నేడే పదో తరగతి ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేసుకోండి..

AP SSC Results 2026 : ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు.

AP SSC Results 2026

AP SSC Results 2026 : ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

విద్యార్థులు ఫలితాలను results.bse.ap.gov.in లేదంటే 10tv.in వెబ్‌సైట్‌లలో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి నేరుగా ఫలితాలను పొందొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలను సులభంగా పొందొచ్చు. ఎలా అంటే.. మీ మొబైల్‌లో 95523 00009 నంబర్ సేవ్ చేయండి. వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపండి. ఆ తరువాత ‘Education Services’ ఎంపికను ఎంచుకోండి. ‘Download SSC Results’ పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి. ఆ వెంటనే మీ మార్కుల మెమో డిస్‌ప్లే అవుతుంది.

ఏపీలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో బాలురు: 3,28,652 మంది, బాలికలు: 3,12,264 మంది ఉన్నారు.

ఇక్కడ క్లిక్ చేయండి.. హాల్ టికెట్ ఎంటర్ చేయండి.. ఫలితాలు వచ్చేస్తాయ్..