AP Assembly Session : 26వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయం- Live Updates

ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు.

Assembly

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు. ఆ తర్వాత టీడీపీ వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. గడిచిన 6 నెలల కాలంలో మృతి చెందిన మాజీ శాసన సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ స్పీకర్ సంతాప తీర్మానం చదివి వినిపించారు. తర్వాత వాయిదా వేశారు. బీఏసీ మీటింగ్ లో ఈనెల 26 వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు.