Ap Capital : 2022 మార్చి బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ ‘ఏపీ 3 రాజధానుల’ బిల్లు

ఐతే... అందరినీ జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

Ap Capital : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అంశంపై వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. అమరావతి-విశాఖ-కర్నూలు మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును ఇటీవలే ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కొత్త బిల్లుతో వస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చింది. ఐతే.. అది ఎప్పుడు.. కొత్త ప్రపోజల్ ఎలా ఉంటుంది… అనేదానిపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ ఉత్కంఠను బ్రేక్ చేశారు.

Read This : Visakha on capital race: విశాఖ ముఖ్య రాజధానిగా ఉండబోతోందా?

వచ్చే ఏడాది(2022) మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని కర్నూలులో చెప్పారు. రాజధాని ప్రకటనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోందన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని చెప్పారు. అమరావతి ఒక్కటే ఏపీ రాజధానిగా ఉండాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఐతే… ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి 3 రాజధానుల అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం దృఢంగా నిర్ణయించుకుంది. ఇదే దిశగా కొత్త నిర్ణయం తీసుకుని అమలు చేయాలని భావిస్తోంది.

Read This : CM Jagan on 3 capitals: 3 రాజధానుల బిల్లు రద్దుపై సీఎం జగన్

వచ్చే మార్చిలో మళ్లీ 3 రాజధానుల ప్రపోజల్ తో బిల్లు తెస్తామని చెప్పడంతో… ఏపీలో అప్పుడే వేడి మొదలైంది. ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా మరోసారి న్యాయపోరాటలు, నిరసనలు త్వరలోనే మొదలవుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే… అందరినీ జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు