AP Caste Certificate : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. ఫీజు జస్ట్ ఎంతంటే!
AP Caste Certificate : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రూ.40కే కుల ధృవీకరణ పత్రం పొందే విధానం, దరఖాస్తు ప్రక్రియ, డౌన్‌లోడ్ వివరాలు తెలుసుకోండి.
- Sreehari A
- Updated on- October 10, 2026 / 08:40 AM IST
AP Caste Certificate
- మన మిత్ర వాట్సప్ సేవల్లో కొత్త సౌకర్యం..
- ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
- జస్ట్ రూ.40 కడితే చాలు.. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటికి
- ఇంట్లో కూర్చునే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ చేతికి!
AP Caste Certificate : ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో డిజిటల్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇకపై రాష్ట్రంలో ప్రజలెవరూ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
వాట్సప్ ద్వారానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజీగా పొందొచ్చు. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ వేదికగా కేవలం రూ.40 చెల్లించి ఈ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. అప్లికేషన్ ప్రక్రియను ఈజీ చేయడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి.
వాట్సప్‌లోనే సర్టిఫికేట్.. సింపుల్ ప్రాసెస్ :
క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలనుకునే వారు ముందుగా మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ నంబర్ 9552300009ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సప్‌లో ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అక్కడ కనిపించే సేవల్లో రెవెన్యూ సర్వీసులను ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘Re-issuance of Integrated Certificates’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాతి దశలో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అప్లికేషన్‌లో అడిగిన వివరాలను సరిగ్గా ఎంటర్ చేసి సమర్పించాలి. నిర్దేశిత ప్రక్రియ పూర్తయ్యాక రూ.40 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. సర్టిఫికేట్ జారీ తర్వాత వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గినట్టే :
ఈ సౌకర్యంతో అర్హులైన పౌరులు కుల ధృవీకరణ పత్రం కోసం స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే, అప్లయ్ చేసుకునే ముందు వివరాలు, పేమెంట్, సర్టిఫికేట్ జారీకి సంబంధించిన తాజా నిబంధనలను అధికారిక వాట్సప్ సేవలో కన్ఫార్మ్ చేసుకోవడం బెటర్..
వాట్సప్‌లో మరిన్ని సేవలు :
కూటమి ప్రభుత్వం అందించే మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా వివిధ పౌర సేవలను పొందవచ్చు. ఆర్టీసీ టికెట్ల బుకింగ్, దేవాలయ దర్శన టికెట్లు, పర్యాటక ప్రాంతాల టికెట్ల వంటి సేవలు కూడా పొందవచ్చు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిజిటల్ సేవల విస్తరణ చేపట్టింది.
