Chandrababu Naidu: దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు.. వేదాశీర్వచనం అందించిన పండితులు!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
- V Santhosh Kumar
- Published on- October 16, 2026 / 06:01 PM IST
Ap cm chandrababu naidu offers silk clothes to kanaka durga at indrakeeladri
Chandrababu Naidu: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం దంపతులకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Abhijit Dipke Arrest: సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత!
వేద ఆశీర్వచనం.. ఆలయ అధికారుల స్వాగతం:
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు సీఎం చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దేవుడిని ప్రార్థించారు.
