AP CM Chandrababu : దసరా వేళ సీఎం చంద్రబాబు సందేశం.. రైతన్న నుంచి యువత వరకు కీలక హామీ!

AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు..

AP CM Chandrababu

  • కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఏపీకి విజయాలు.. చంద్రబాబు ఆకాంక్ష
  • ఏపీ ప్రజలకు చంద్రబాబు దసరా శుభాకాంక్షలు.. ఇంకా ఏమన్నారంటే?
  • రైతులకు ఫలితం.. మహిళలకు సాధికారత.. యువతకు భరోసా

AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై తన ఆకాంక్షలను వ్యక్తం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి ఒక్కరిలో కొత్త స్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు.

రైతన్న శ్రమకు ఫలితం.. మహిళలకు సాధికారత :
కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని చంద్రబాబు తన సందేశంలో స్పష్టం చేశారు. రైతులు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అందించడం, మహిళలను అన్ని రంగాల్లో మరింత శక్తిమంతులుగా తీర్చిదిద్దడం, యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ సంకల్పాలు విజయవంతం అయ్యేలా జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Read Also : Pension Alert 2026 : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు ఇదొక్కటి చేయండి.. లేదంటే పెన్షన్‌ పోయినట్టే..!

రాష్ట్ర అభివృద్ధికి దుర్గమ్మ ఆశీస్సులు :
విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అభివృద్ధి పథంలో రాష్ట్రం మరింత వేగంగా ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకున్నారు.

ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పండుగ స్ఫూర్తితో ప్రజలంతా సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన సందేశంలో తెలిపారు.

మంగళవారం విజయదశమి పండుగ నేపథ్యంలో సోమవారం తన ఎక్స్‌ (X) ఖాతా ద్వారా చంద్రబాబు ఈ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువత భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలకు పండుగ సందేశాన్ని అందించారు.

చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసే దసరా పర్వదినం రాష్ట్రానికి కొత్త ఆశలు, ప్రజలకు ఆనందాన్ని తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.