YS Sharmila Health : ఆస్పత్రి బెడ్‌పై వైఎస్ షర్మిల.. ఏమైంది..? ఫొటో వైరల్

YS Sharmila Health : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.

YS Sharmila

  • ఆస్పత్రి బెడ్ పై షర్మిల
  • శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు
  • సోషల్ మీడియా ఖాతాలో ఫొటో షేర్ చేసిన షర్మిల

YS Sharmila Health : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. తాజాగా.. ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫొటోను షర్మిల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికితోడు అభిమానులు ఆందోళన చెందకుండా ఓ సందేశం కూడా ఇచ్చారు.

Also Read : AP Telangana Weather Update : ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు.. ఐఎండీ కీలక అప్‌డేట్.. హెచ్చరికలు జారీ

షర్మిల తెలిపిన వివరాల ప్రకారం..”ఇటీవల నాకు పొత్తికడుపు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం నేను బాగున్నాను, చాలా వేగంగా కోలుకుంటున్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయంలో నా కోసం ప్రార్థనలు చేసిన వారికి, ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు నాకు ఎంతో బలాన్నిచ్చాయి” అని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.’’ అయితే, షర్మిలకు సర్జరీ ఎప్పుడు జరిగింది..? ఏ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు అనే వివరాలు తెలియజేయలేదు.

గత కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడికిపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇలాంటి సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దగా నిరసన కార్యక్రమాలు జరగకపోవటంతోపాటు, షర్మిల కనిపించకపోవటంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, ఆమె అభిమానుల్లో కాస్త ఆందోళన వ్యక్తమైంది. ఈ తరుణంలో షర్మిల తనకు సర్జరీ జరిగిందని, తాను కోలుకుంటున్నానని పేర్కొంటూ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఫొటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.