ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మండలిలో నిబంధనలకు
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మండలిలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానని స్పష్టం చేశారు. మెజార్టీ ప్రకారమే నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఏ పార్టీకి పక్షపాతంగా వ్యవహరించలేదన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలి సెలెక్ట్ కమిటీకి వెళ్తాయని చెప్పారు. రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీని నియమిస్తామన్నారు. కాగా, శాసనమండలిని సీఎం జగన్ రద్దు చేస్తారని వస్తున్న వార్తలపై షరీఫ్ స్పందించారు. మండలి రద్దైతే.. బిల్లు సంగతి ఏమిటనేది నాకు తెలియదని ఆయన అన్నారు.
మూడు రాజధానుల బిల్లుని శాసనసభలో ఆమోదింపజేసుకున్న జగన్ ప్రభుత్వానికి మండలిలో షాక్ తగిలింది. కీలక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ నిర్ణయించారు. దీంతో మూడు రాజధానులకు బ్రేక్ పడింది. సెలెక్ట్ కమిటీ ప్రక్రియకు కనీసం 3 నెలలు సమయం పడుతుంది. అప్పటివరకు వికేంద్రీకరణ బిల్లు చట్టంగా మారదు. మండలిలో నాటకీయ పరిణామల నడుమ.. బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చైర్మన్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, టీడీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపణలు చేశారు.
బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్.. ఏకంగా మండలిని రద్దు చేసే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. పేదరికంలో ఉన్న రాష్ట్రానికి మండలి అవసరమా? అని శాసనసభలో సీఎం జగన్ అనడం సంచలనమైంది. మండలిని రద్దు చేయనున్నారనే సంకేతాలు ఇచ్చింది. సోమవారం(జనవరి 27,2020) ఉదయం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అందులో మండలి రద్దుపై సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.
మండలి చైర్మన్ కామెంట్స్:
* రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు
* మండలి రద్దుపై నో కామెంట్
* నన్ను దూషించడం అనేది సర్వ సాధారణం
* బిల్లు కౌన్సిల్ స్టడీలో ఉంది
* రూల్స్ కు విరుద్ధంగా నేను ఎక్కడా వ్యవహరించ లేదు
Also Read : మండలి రద్దు..? : ఏపీ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ