ఏపీలో కరోనా తగ్గుముఖం : 7,485 మంది రికవరీ
- Sreehari A
- Published On : October 2, 2020 / 07:40 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
గడిచిన 24 గంటల్లో 7,485 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,399 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 6,555 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 31 మంది మృతిచెందారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 59,48,534 శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో కరోనా కేసులు 7,06,790 లక్షలపైన దాటేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,900 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 56,897 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,41,098 మంది (AP Covid Recovery cases) డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు.
