AP Govt : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాల్లో కొత్త సర్వే.. ఎందుకంటే?

AP Govt : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

AP Deputy CM Pawan Kalyan

  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
  • రాష్ట్రంలోని గ్రామాల్లో కొత్త సర్వే
  • ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా కార్యాచరణ

AP Govt : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతిగ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన అదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కల్యాణ్ సూచించారు.

Also Read : AP Weather : ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. ఈ సమయాల్లో అస్సలు బయటకు రావొద్దు.. బాబోయ్.. ఇవేం ఎండలు సామీ.. సరికొత్త రికార్డులు నమోదు..

ఈ సర్వే ద్వారా ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు.. ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశాన వాటికలు, రోడ్లు, డ్రైనేజ్, నీటి వనరుల స్థితి పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.

పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు. పల్లె పండుగ తొలి విడతలో 4వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. మొదటి విడతలో 22,514 గోకులాలు పూర్తి చేయగా.. రెండో విడతలో 15,303 గోకులాలు నిర్మించినట్లు వెల్లడించారు. పశువుల తాగునీటి అవసరాల కోసం 15,188 నీటి తొట్టెలు నిర్మించినట్లు వెల్లడించారు. పశువుల తాగునీటి అవసరాలకోసం 15,188 నీటి తొట్టెలు నిర్మించినట్లు తెలిపారు. మొదటి విడతలో 21వేల ఫార్ పాండ్స్ పూర్తి చేస్తే.. రెండో విడతలో 86వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించినట్లు వెల్లడించారు.

మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నాణ్యత లోపిస్తే సహించేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఉపాధి హామీ కింద మార్గదర్శకాల్లో లేని పనులను చేపట్టవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన బడ్జెట్ పరిమితిలోనే నిధులు, మార్గదర్శకాలలో ఉన్న పనులకే అనుమతి ఇవ్వాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.