Pawan Kalyan : స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. పరిహారం ప్రకటించిన పవన్ కల్యాణ్..
Pawan Kalyan : స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధాకరం. లిక్విడ్ స్టీల్ లీక్‌తో 8మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్నివిధాల అండగా ఉంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
- Harish Thanniru
- Published on- June 9, 2026 / 01:32 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారంతోపాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధాకరం. లిక్విడ్ స్టీల్ లీక్‌తో 8మంది ప్రాణాలు కోల్పోయారు. బాదితులతో మాట్లాడాను. సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకున్నారో నివేదిక రావాల్సి ఉంది. 23 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదు. చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా లాడిల్ బ్లాస్ట్ లాంటి ప్రమాదాలు జరగలేదు. సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ కూడా చూశానని పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షలు నష్టపరిహారం అందిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులుకు అండగా ఉంటామని పవన్ పేర్కొన్నారు.
బూకారో స్టీల్ ప్లాంట్ నుండి నిపుణులతో త్రీమాన్ కమిటీ వేశాం. ప్రవేటీకరణను మొదటి నుండి నేను కూడా వ్యతిరేకించా. క్యాపిటీవ్ మైన్స్ లేకపోవడం విశాఖ ఉక్కుకి బాధాకరం. ఈ ప్రమాద తీవ్రత తగ్గిన తర్వాత కార్మికుల సమస్యలుపై మీటింగ్ ఏర్పాటు చేసి కూలంకుషంగా అన్ని విషయాలు తెలుసుకుంటాను. సేఫ్టీ ఆడిట్ విషయంలో అధికార యంత్రాంగాలలో లోపాలు ఉంటే ఊరుకునేది లేదు… కచ్చితంగా చర్యలు ఉంటామని పవన్ కల్యాణ్ అన్నారు. కమిటీ నివేదిక రావాల్సి ఉంది. టెక్నాలజీ పరంగా ఏం లోపాలు ఉన్నాయి అన్నది తెలియాల్సి ఉంది. నా వరకు ఈ దుర్ఘటనలు నన్ను చాలా బాధించాయి. మరోమారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తాం అంటే నేను స్వయంగా కూర్చుని పోరాటం చేశాను. అందరం కలిసి కాపాడుకోవాలి . కార్మిక సంఘాలు నిర్మాణాత్మకంగా పనిచేయడంలో విఫలం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకి అనుగుణంగా కార్మికసంఘాలు వ్యవహరిస్తున్నాయి. యూనియన్స్ వాళ్ళ పనులు సరిగా చేస్తున్నాయా? వారికి నిబద్ధత ఉంటే.. ప్రభుత్వంలో భాగస్వామ్యంతో ఉన్నా నేను కార్మికుల వైపు ఉంటానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ గా ఉండాలనేది అందరి ఆకాంక్ష. అలాగే కొనసాగిస్తాం. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలను వారి నుంచే అడిగి తెలుసుకుంటాం. ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు తెలుసుకుంటామని పవన్ పేర్కొన్నారు.
