AP EAPCET Results 2026: ఏపీ ఎంసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఇలా చెక్ చేసుకోండి.. ర్యాంక్ కార్డులకోసం విద్యార్థుల ఉత్కంఠ

AP EAPCET Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2026) ఫలితాల విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది.

AP Eapcet 2026 Results Date And Time

  • ఏపీలోని లక్షల మంది విద్యార్థులకు గుడ్‌న్యూస్
  • AP EAPCET 2026 ఫలితాలపై కీలక అప్డేట్
  • ర్యాంక్ కార్డుకోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!

AP EAPCET Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET ) ఫలితాల విడుదలకోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా.. ఫలితాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 22వ తేదీన (సోమవారం) ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 1వ తేదీన ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల ప్రక్రియ కారణంగా ఫలితాలను వాయిదా వేశారు. ఈఏపీసెట్‌లో 25శాతం ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఉందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మార్కుల మెరుగుదలకు ప్రభుత్వం ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ ఫలితాలు వస్తేగానీ ఈఏపీసెట్‌లో ర్యాంకుల నిర్ణయం కాదు.. దీంతో ఈ మార్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం గురువారం ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో AP EAPCET 2026 ఫలితాలు జూన్ 22వ తేదీన ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుండగా.. వీలునుబట్టి జూన్ 20వ తేదీన లేదంటే జూన్ 22వ తేదీన ఫలితాలను విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read – Annadatha Sukhibhava : ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే..

ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్ ప్రక్రియపై త్వరలో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ర్యాంకు పొందడానికి అభ్యర్థులు కనీసం 25శాతం మార్కులు (160కి 40) సాధించాల్సి ఉంటుంది. ఈ కనీస అర్హతను అందుకోలేని వారికి ర్యాంకు కేటాయించబడదు. వారు కౌన్సెలింగ్ ప్రక్రియకు అనర్హులుగా పరిగణించబడతారు.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

  • cets.apsche.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • AP EAPCET 2026 Result లింక్‌పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఫలితం, ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • భవిష్యత్ అవసరాలకోసం డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

ఇదిలాఉంటే.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్‌‌ 2026 ఆన్‌లైన్ పరీక్షలను మే20వ తేదీ నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి మొత్తం 3,55,803 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,29,474 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్, ఫార్మసీ (ఎంపీపీ స్ట్రీమ్)కి 2,76,576 మంది దరఖాస్తు చేయగా.. 2,58,545 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్)కి 79,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 70,929 మంది హాజరయ్యారు.