ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. సవివర కారణాలతో 3 పేజీల లేఖ రాశారు. ఎన్నికలు వాయిదాకు కారణాలను వివరించారు.
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. సవివర కారణాలతో 3 పేజీల లేఖ రాశారు. ఎన్నికలు వాయిదాకు కారణాలను వివరించారు. ఎన్నికల సంఘంపై దాడి జరుగుందన్నారు. తమ తప్పులేకుండానే విమర్శలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. నిధుల విడుదలకు ఎన్నికల నిర్వహణ ఓ షరతు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికలు జరుపకుండానే గతంలో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయించుకున్నాయని రమేష్ కుమార్ తెలిపారు. కరోనా వల్లే ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. కరోనాతో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేశారని తెలిపారు. వాయిదాకు ముందు ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించామని తెలిపారు.
ఎన్నికలు ఆపాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నిన్న సీఎస్ నీలం సాహ్ని.. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఎన్నికలు వాయిదా వేయొద్దు…ఎన్నికలు జరపాలని కోరారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, స్థానిక ఎన్నికలను యథాతథంగా నిర్వహించాలని అన్నారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్లమని లేఖలో పేర్కొన్నారు. కేవలం ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉందని చెప్పారు. స్థానికంగా ఎవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు.
రానున్న మూడు, నాలుగు వారాల్లో ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉండదని సీఎస్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు పూర్తి చేయాలని కోరారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో వివరించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టొచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చన్నారు. మరో 3, 4 వారాల పాటు కరోనా అదుపులోనే ఉంటుందని ఎన్నికల కమిషనర్ కు రాసిన లేఖలో సీఎస్ తెలిపారు.
దానికి బదులిస్తూ ఈసీ రమేష్ కుమార్ కొద్దిసేపటికి క్రితమే సీఎస్ కు లేఖ రాశారు. లేఖలో ఆనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా రెండురోజుల నుంచి మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలు తమ తప్పు లేకపోయినా సరే తమపై మాటల దాడులు చేస్తున్నారని మొదట్లో ఆయన ప్రస్తావించారు. ఎన్నికల సంఘానికి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
ముఖ్యంగా 14 ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు రావడానికి, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేవలం ఒక కండీషన్ మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశానని, గవర్నర్ రాజ్ భవన్ లో కూడా ఫైనాన్స్ కు సంబంధించి వ్యవహారాల చూశానని..దీనిపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. చాలా వరకు రాష్ట్రాలు ఎన్నికలు నిలిచిపోయినా కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చిన పరిస్థితి ఉందన్నారు.
కరోనాకు సంబంధించిన ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఎక్కడ కూడా కరోనా లేదని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యుహెచ్ వో నుంచి కూడా కీలకమైన ఆదేశాలు అన్ని రాష్ట్రాలు, అన్ని హెల్త్ సెక్రటరీలకు వస్తున్నాయి. కరోనాపై పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని పూర్తిస్థాయిలో ఆదేశాలు వస్తున్నాయని చెప్పారు.
ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు. దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రమేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని జగన్ ఫైర్ అయ్యారు. దీనిపై ఆయన గవర్నర్ విశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. దీంతో స్థానిక ఎన్నికల వాయిదా పంచాయతీ గవర్నర్ దగ్గరకు చేరింది.
గవర్నర్ పిలుపుతో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ దగ్గరికి వెళ్లారు. సోమవారం(మార్చి 16,2020) ఉదయం ఆయన గవర్నర్ ను కలిశారు. గవర్నర్ తో భేటీ అయిన రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను, కారణాలను వివరించారు.
Also Read | తెలంగాణ నుంచి వెళ్లిపోతా, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు