Thalliki Vandanam : బిగ్ అలర్ట్.. తల్లికి వందనం కింద రూ.13వేలు రావాలంటే వెంటనే ఇలా చేయండి..
Thalliki Vandanam : గత సంవత్సరం ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పలు జిల్లాల్లో అనేకమంది అర్హత ఉండికూడా తల్లికి వందనం పథకంకు దూరమయ్యారు. అయితే, గతంలో ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
- Harish Thanniru
- Updated on- May 26, 2026 / 09:39 AM IST
Thalliki Vandanam
- ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
- వచ్చే నెలలోనే తల్లికి వందనం పథకం నిధులు
- రూ.13వేలు రావాలంటే వెంటనే ఇలా చేయాల్సిందే..
Thalliki Vandanam : ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద కుటుంబంలోని పిల్లలందరినీ అర్హులుగా నిర్దారించింది. ఇందులో భాగంగా బడికి వెళ్లే ప్రతీ విద్యార్థికి రూ.15వేలు చొప్పున నగదు జమ చేస్తోంది. ఇందులో రూ.2వేలు పాఠశాల నిర్వహణ ఖర్చులకు జమ చేస్తుండగా.. మిగిలిన రూ.13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది.
గతేడాది ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది జూన్ నెలలో మరోసారి తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈనెలలోనే పాఠశాలలు ప్రారంభమైన కొద్దిరోజులకే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత సంవత్సరం ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పలు జిల్లాల్లో అనేకమంది అర్హత ఉండికూడా తల్లికి వందనం పథకంకు దూరమయ్యారు. అయితే, గతంలో ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా ముందస్తుగా బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. అలాగే బ్యాంకుకు వెళ్లి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలని పేర్కొంది.
