×
Ad

AP Govt : ఏపీలోని రైతులకు శుభవార్త.. 15రోజుల్లో ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో శనగల కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపింది.

AP Govt

  • రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
  • రాష్ట్ర వ్యాప్తంగా శనగల కొనుగోళ్లు ప్రారంభం
  • 15 రోజుల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో శనగల కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపింది. కొనుగోళ్లు జరిపిన 15రోజుల్లోపు రైతుల ఖాతాల్లో నగదు చెల్లింపులు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా 2026-27 రబీ సీజన్‌కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read : Nara Lokesh : బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ కీలక కామెంట్స్.. భారత్-పాక్ మ్యాచ్‌పై కౌంటర్

రబీ సీజన్ (2025-26)లో పండించిన శనగలకు మద్దతు ధర కల్పించి కనుగోలు చేసేందుకు కేంద్రం నుంచి మంగళవారం అనుమతులు లభించాయని, బుధవారం నుంచే క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు మొదలవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్‌కే) ద్వారానే తమ పంటను విక్రయించుకోవాలని సూచించారు. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ఏజెన్సీల ద్వారా సుమారు 94,500 మెట్రిక్ టన్నుల శనగలను సేకరించనున్నామని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో డీఎల్‌పీసీ బృందాలు పర్యవేక్షిస్తాయని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 3.77లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వారి పంట వివరాలను నమోదు చేయించుకోవాలి. సీఎం యాప్ ద్వారా వీటి కొనుగోళ్లు చేపడతారు. కొనుగోలు చేసిన శనగలను గోదాముల్లో నిల్వ చేస్తారు. రైతు నుంచి కొనుగోళ్లు జరిపిన పంటకు సంబంధించిన నగదును 15రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.